తేమతో కరోనా మరింత ప్రమాదకరం
గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ మనిషికి వెలుపల జీవించే సమయం 23 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. గాలి వదిలే సమయంలో, దగ్గినా, తుమ్మినా వైరస్ తుంపరల ద్వారా బయటకు వస్తుంది. మనిషి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ సులువుగా వ్యాప్తి చెందుతుంది. వైరస్‌కు గాలిలో తేమ తోడైతే చాలా ప్రమాదకరం. ఎక్కువ పరిమాణం ఉన్న మైక్రాన్లు ఎక్కువ వైరస్‌ను కలిగి ఉంటాయి. 50 మైక్రాన్లు ఉన్న తుంపరలు 16 అడుగుల దూరం వ్యాప్తించగలవు. 100 మైక్రాన్లు ఉన్న తుంపరలు ఆరడుగుల దూరం ప్రయాణించగలవు. అయితే 3.5 మీటర్లను దాటి ఏ తుంపరలు ప్రయాణించలేవు. భౌతిక దూరం పాటించడం ఒక్కటే తప్పించుకునే మార్గం అని తెలిపింది.






