ఒక రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు
భారత్లో కరోనా విలయతాండవం చేస్తుంది. లాక్డౌన్ అమలు అవుతున్నప్పటికి పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5242 కరోనా కేసులు నమోదు కాగా, 157 మంది మరణించారు. అయితే గత రెండు రోజులుగా రోజు దాదాపు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో సోమవారం నాటికి దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 96,169కి చేరింది. వీరిలో 3029 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 36,824 మంది కోలుకోగా 56,316 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఒకే రోజు ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా సోమవారం నాలుగో విడత లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడినవారి సంఖ్య 48,01,875 కి చేరింది. ఇప్పటి వరకు 3,16,671 మంది మృత్యువాతపడ్డారు.






