కొత్త రకం మాస్క్.. ఖరీదెక్కువే
రెండు ఫిల్టర్లున్న కొత్తరకం మాస్క్‌తో స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరైన ఈయన విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్యకశాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్. హాఫ్ ఫేస్ పీస్‌గా పిలిచే ఈ మాస్క్ అసలు పేరు క్లినికల్ కెమికల్ ప్యూమ్ రెస్పిరేటరీ మాస్కు.. దీన్ని ధరించడంలో కొంత అసౌకర్యం ఉన్నా, పూర్తి రక్షణాత్మకమైనదని సుధాకర్ తెలిపారు. దీనికి రెండు వైపులా ఉన్న ఫిట్టర్లను నెల రోజులపాటు ఏకధాటిగా వాడొచ్చు. నెల తర్వాత కొత్తవి అమర్చుకోవాలి. అమెరికా నుంచి సన్నిహితులు పంపారని, దేశీయ మార్కెట్లో దీని ధర రూ.6 వేల వరకు ఉంటుందని సుధాకర్ వివరించారు.






