19 నుంచి దేశీయ విమాన సర్వీసులు
దాదాపు 50 రోజులుగా స్తంభించిపోయిన దేశీయ విమాన సర్వీసులు పున ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 నుంచి దశలవారీగా సర్వీసులను ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోందని ఎయిరిండియా వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. జూన్ 2 వరకు ఢిల్లీ, ముంబై, హైదరాదాద్, బెంగళూరు నుంచి ప్రత్యేక విమానాలు నడపాలని సూత్రపాయంగా నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. విదేశాల నుంచి తరలి వచ్చిన భారతీయులను దేశంలోని వివిధ రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా విమాన సర్వీసుల షెడ్యూలు ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. కాగా ఈ నెల 12 నుంచి తొలిదశ కింద ప్యాసింజర్ రైలు సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.






