కరోనా చికిత్సకు రూ.8 కోట్లు
కరోనాపై సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించిన ఆ 70 ఏళ్ల వృద్ధుడికి.. ఆస్పత్రి బిల్లును చూసిన తర్వాత, ఎందుకు బతికానా అన్పించిందట. సియాటెల్‌కు చెందిన మైఖేల్ ఫ్లోర్‌కు కరోనా సోకడంతో 62 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. ఒకసారి మరణం అంచులదాకా వెళ్లాడు. ఇంటికి ఫోన్ చేసి కుటుంబికులతో ఆఖరి మాటాలు కూడా మాట్లాడేశాడు. కానీ చివరికి కోలుకుని కరోనాపై గెలిచాడు. అయితే, ఏకంగా ఓ చిన్న సైజు పుస్తకంలా 181 పేజీలతో ఉన్న 8 కోట్ల బిల్లును చేతిలో పెట్టారు ఆస్పత్రి సిబ్బంది. అది చూసిన మైఖేల్‌కు గుండె ఆగినంత పనైందట. 42 రోజుల ఐసోలేషన్‌కు రూ.3 కోట్లు, 29 రోజుల వెంటిలేటర్‌కు రూ.62 లక్షలు, ఐసీయూ గదికి రోజుకు రూ.7 లక్షలు, మందుల ఖర్చు తదితరాలు కలిపి అన్ని కోట్ల బిల్లు వేశారు. ఆరోగ్య బీమా ఉండడం, కరోనా వ్యాధి కావడంతో ఆ బిల్లులో అధిక శాతం మైఖేల్ చెల్లించనవసరం లేదు. అందువల్ల రెండోసారి బతికోయాడు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరాడు. అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ, విపరీతమైన ఆస్పత్రి ఖర్చులపై వృద్ధుడి కుటుంబం, స్నేహితులు ఆశ్చర్య పోయారట.






