నల్లకోటుకు గుడ్‌బై
న్యాయమూర్తులు, లాయర్లు, నల్లకోట్లు, నల్లగౌన్లకు త్వరలోనే వీడ్కోలు చెప్పనున్నారు. శాశ్వతంగా కాకపోయినా కరోనా ఉన్నంతకాలమైనా వాటికి గుడ్‌బై చెప్పే అవకాశం ఉన్నది. కరోనాను ఆకర్షించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి న్యాయమూర్తులు, న్యాయవాదులు నల్లకోట్లు, నల్లగౌన్లు ధరించడాన్ని మానుకోవాలి అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బోబ్డే పేర్కొన్నారు. త్వరలోనే కొత్త దుస్తుల కోడ్‌ను ప్రకటిస్తానని, అప్పటివరకు నలుపు రంగును వినియోగించవద్దని కోరారు. బుధవారం ఆయనతో పాటు ఇతర జడ్జీలు సైతం నల్లకోటు లేకుండా తెలుపు రంగు షర్ట్, మెడకు బ్యాండ్ ధరించి హాజరయ్యారు.






