కాలిఫోర్నియా వర్సిటీకి తగ్గిన విదేశీ విద్యార్థులు
గత 12 ఏళ్లలో తొలిసారిగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గింది. అంతకు ముందు దాదాపు దశాబ్దకాలం పాటు యూనివర్సిటీకి వచ్చే విదేశీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య ప్రతి ఏడాది సగటున 21 శాతం వృద్ధి నమోదయ్యేది. ఈ విశ్వ విద్యాలయంలో 2017లో కోర్సుల్లో చేరడానికి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబరుతో ముగిసింది. ఆ నెలలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం తెలిసిందే. అత్యధికంగా మెక్సికో నుంచి వచ్చే దరఖాస్తుల్లో 30 శాతం తగ్గిపోగా, ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉండే దేశాల నుంచి ఈసారి 10 శాతం తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.






