TTA: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన ‘టీటీఏ మెగా కన్వెన్షన్’.. షార్లెట్ వేదికగా తెలుగు సంస్కృతి వేడుకలు త్వరలో
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘టీటీఏ మెగా కన్వెన్షన్ 2026’ నిర్వహణకు రంగం సిద్ధమైంది. నార్త్ కరోలినాలోని షార్లెట్ నగరంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ భారీ వేడుకల కోసం యావత్ తెలుగు సమాజం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జులై 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు ఈ మహాసభలు వైభవంగా జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
విభిన్న కార్యక్రమాలు..
తెలుగు సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబంగా సాగే ఈ కన్వెన్షన్లో అన్ని వయసుల వారికి నచ్చేలా విభిన్న కార్యక్రమాలను రూపొందించారు. ఇందులో ప్రధానంగా సాంస్కృతిక ప్రదర్శనలు, యువత, మహిళా ఫోరమ్లు, సాహిత్య చర్చలు, వ్యాపార, వైద్య (CME) సెమినార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
అలాగే సీఎక్స్ఓ (CXO) నెట్వర్కింగ్, ఆధ్యాత్మిక సమావేశాలు, మ్యాట్రిమోనియల్ మీటప్స్ వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ కన్వెన్షన్ ద్వారా మన వారసత్వాన్ని పంచుకోవడమే కాకుండా, కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి, మర్చిపోలేని జ్ఞాపకాలను మూటగట్టుకోవడానికి ఒక గొప్ప అవకాశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ చారిత్రక వేడుకలో భాగస్వాములు కావాలని టీటీఏ కార్యవర్గ సభ్యులు కోరుతున్నారు.






