TTA: టీటీఏ డల్లాస్ ఛాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) (TTA) డల్లాస్ ఛాప్టర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో 800 మందికిపైగా స్థానికులు హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో 10కి పైగా అందమైన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పాటలు, డ్యాన్సులు, రుచికరమైన ఆహారం, ఎనర్జిటిక్ డీజేతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమం ఘనవిజయం సాధించిన సందర్భంగా టీటీఏ (TTA) వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపె్ది, ఏసీ, ఈసీ, బీవోడీ టీమ్స్, డల్లాస్ టీం సభ్యులు ప్రవీణ్ చింతా (డెవలప్మెంట్ డైరెక్టర్), నరేష్ బైనగిరి (బీవోడీ), వెంకట్ అన్నప్పరెడ్డి (బీవోడీ)తోపాటు ఆర్వీపీలు సందీప్, శేఖర్, మహేష్, మహిళా లీడర్షిప్ టీంకు డల్లాస్ ఛాప్టర్ ధన్యవాదాలు తెలిపింది. వుమెన్స్ టీడర్షిప్ టీం సభ్యులు డాక్టర్ ప్రశాంతి కనుగుల, సింధూషా వుప్పు, శ్రుతి అకవరమ్, శ్రుతి అనిరెడ్డి, నాగమణి మేక, తదితరులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసింది. అలాగే స్పాన్సర్లు ఫస్ట్ ఇన్ఫ్రా, ఏజీ ఫిన్టాక్స్, దేశీ డిస్ట్రిక్ట్, డెసిబెల్స్ ఆడియో, వరుణ్ డిజిటల్, ఫార్మ్2కుక్, ఫోర్ ఓక్స్ ఇన్సూరెన్స్ గ్రూప్, మరియు యూఈఎస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఎల్సీ తదితరులకు కూడా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ టీటీఏ (TTA) డల్లాస్ ఛాప్టర్.. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.







