TTA: టీటీఏ ఆధ్వర్యంలో పలు నగరాల్లో బోనాల జాతర
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో యూఎస్‌లోని పలు ప్రధాన నగరాల్లో బోనాల జాతర (TTA Bonala Jatara) వేడుకలు నిర్వహించనున్నారు. టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మైలపల్లి నేతృత్వంలో ఈ కార్యక్రమాలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ పండుగను అద్భుతంగా జరుపుకునేందుకు టీటీఏ సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే యూఎస్‌లోని పలు నగరాల్లో ఉన్న తెలుగు కమ్యూనిటీలన్నింటినీ కలుపుకొని పోతూ.. 8 నగరాల్లో బోనాల జాతరను (TTA Bonala Jatara) నిర్వహించాలని టీటీఏ నిర్ణయించింది. ఇప్పటికే జూన్ 29న అట్లాంటాలో, జులై 13న సియాటెల్‌లో ఈ వేడుకలను టీటీఏ ఘనంగా నిర్వహించింది. అనంతరం జులై 19న న్యూజెర్సీ, డల్లాస్, ఫిలడెల్ఫియాల్లో బోనాల జాతర నిర్వహించనున్నారు. ఆ తర్వాత జులై 20వ తేదీన న్యూయార్క్, ఇండియానాపోలిస్, షార్లట్‌లో (TTA Bonala Jatara) పోలంద్ లో ఈ వేడుకలు జరుగుతాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారంతా పాల్గొన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీటీఏ కోరుతోంది.







