Kavitha: అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి : కవిత
అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి (Telangana Jagruti) జనం బాటలో భాగంగా అసెంబ్లీ (Assembly) ఎదురుగా ఉన్న గన్‌పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం నిజామాబాద్ (Nizamabad) పర్యటనకు కవిత బయలు దేరి వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్లామో ఆలోచించుకోవాలని కవిత కోరారు.







