MATA: నవంబరు 1న మ్యూనిచ్‌లో మాటా దీపావళి వేడుకలు
మన తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో మ్యూనిచ్ వేదికగా దీపావళి సంబరాలకు ముహూర్తం ఫిక్సయింది. 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మాటా (MATA) నవంబర్ 1న మధ్యాహ్నం 12:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు మ్యూనిచ్‌లోని బర్గర్‌హౌస్ గార్చింగ్‌లో దీపావళి వేడుకలు నిర్వహించనుంది. ఈ అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా భారత్ నుంచి కళాకారులు వస్తారని మాటా (MATA) తెలిపింది. ఈ వేడుకలకు టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. మాటా లైఫ్‌టైమ్ సభ్యులకు 15 యూరోలు, మాతా సభ్యులకు 18 యూరోలు, నాన్ మెంబర్‌లకు 20 యూరోలుగా టికెట్ ధరలను నిర్ణయించారు. అలాగే 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు 10 యూరోల టికెట్ ఉంటుందని చెప్పిన మాటా (MATA).. ఎర్లీ బర్డ్ టిక్కెట్లు అక్టోబర్ 20తో ముగుస్తాయని, ఆ తర్వాత టిక్కెట్ ధరలు 25 యూరోలకు పెరుగుతాయని వెల్లడించింది. మాటా సభ్యులుగా చేరాలనుకునే వారు కూడా ఈ సమయంలో కొత్త సభ్యత్వాలు తీసుకోవచ్చని తెలియజేసింది.
ఈ దీపావళి వేడుకలకు ఫుడ్ పార్ట్‌నర్‌గా నమస్తే ఇండిస్చెస్ రెస్టారెంట్, తత్వ ఇండిస్చెస్ రెస్టారెంట్ వ్యవహరిస్తున్నాయి. అలాగే ఎక్స్‌పాట్ ఫైనాన్స్ జర్మనీ, ఏఎంవీఎస్ (AMVS) గ్లోబల్ జీఎంబీహెచ్, మెగా రియాల్టీ, రాబర్టో బీచ్, జేఎస్ఏఎన్ కన్సల్టింగ్ ఈ దీపావళి వేడుకలను స్పాన్సర్ చేస్తున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం కోసం INFO@MATAGERMANY.COM కు ఈమెయిల్ చేయొచ్చని, లేద +49 15563 424895 ఫోన్ నంబర్‌కు కాల్ చేయొచ్చని మాటా (MATA) పేర్కొంది.







