R. Krishnaiah: బీసీ ఉద్యమం దేశానికే రోల్‌మోడల్ : ఆర్.కృష్ణయ్య
బీసీల జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు (Political parties) ఏకాభిప్రాయంతో మద్దతు తెలపాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ విద్యార్థుల సదస్సు (BC Student Conference) లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ఉద్యమం దేశానికే రోల్‌మోడల్ గా నిలిచిందన్నారు. ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నామని, విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే హైకోర్టు స్టే (High Court) ఇచ్చిందని ఆరోపించారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించడమే శాశ్వత పరిష్కారమని అన్నారు. బీసీ జేఏసీ రాష్ట్ర బంద్ పూర్తిగా విజయవంతమైందని, ఇది బీసీల చైతన్యనానికి ప్రతీక అన్నారు.







