TANA: మిచిగన్‌లో తానా స్కూల్ బ్యాగుల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) నార్త్ రీజినల్ ప్రాంతం నాయకుల ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకోసం బ్యాక్ ప్యాక్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పిల్లలకు స్కూల్ బ్యాగ్ లను, కిట్‌లను పంపిణీ చేశారు. అక్టోబరు 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఈస్ట్‌పాయింట్ మిడిల్ స్కూల్ (24701 కెల్లీ రోడ్, ఈస్ట్‌పాయింట్, మిచిగన్ 48021)లో విజయవంతంగా జరిగింది.
ఈ సేవా కార్యక్రమానికి తానా కార్యదర్శి సునీల్ పంత్ర, తానా ఫౌండేషన్ ట్రస్టీ కిరణ్ చౌదరి, మరియు నోవి నగర జోనింగ్ బోర్డు ఛైర్మన్ జో పెద్దిబొయిన తమ సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉత్తర ప్రాంత ప్రాంతీయ సమన్వయకర్త రాంప్రసాద్ చిలుకూరి ధన్యవాదాలు తెలియజేశారు.







