తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర టివి నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక గారిని కలిసిన తెలుగు టెలివిజన్ పరిశ్రమ ప్రముఖులు
తెలుగు టెలివిజన్ పరిశ్రమ కార్మికులు ఎదుర్కుంటున్న ప్రదాన సమస్యలకు, పరిష్కార దిశగా టి వి పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, కార్మికులు తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర టి వి నాటక రంగ అభివృద్ధి సంస్థ కు చెందినా సమాచార్ భవన్ లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక IAS గారితో ఈ రోజు సాయత్రం సమావేశం జరిగింది. ఈ సమావేశం లో సంస్థ ఎక్సిక్యూటివ్ డైరక్టర్ కిషోర్ బాబు గారు కూడా పాల్గొన్నారు. తెలుగు టెలివిజన్ వర్కర్స్, టెక్నీషియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నాగబాల సురేష్ కుమార్ గారి సారధ్యం లో జరిగిన సమావేశానికి టి వి నటి నటులు, అశోక్ కుమార్, జి.యల్ శ్రీనివాస్, లహరి, మధు ప్రియ, మాణిక్, నటి సూర్యకళ, దర్శకులు-రచయిత సంఘం అధ్యక్షులు శ్రీ ప్రేం రాజ్, నరేంద్ర, తెలుగు తెలంగాణా సినీ టివి నటి నటుల సంఘం అధ్యక్షులు రాజ్ శేఖర్, గోపాల కృష్ణ, యం.ఎస్. ప్రసాద్, చిత్తరంజన్ దాస్, సినీ.టి.వి గేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు, సత్యం యాబి మాస్టారు, అక్కినేని శ్రీధర్ లక్ష్మి, డాక్టర్ శ్రీరాందత్తి, శ్రీరామోజు లక్ష్మి నారాయణ, భాస్కర్ల వాసు, నరేందర్ రెడ్డి, ఆర్ డి ఎస్ ప్రకాష్ తది తర షుమారు 60 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
భారత దేశం లో ప్రస్తుతం తెలుగు టి వి రంగ పరిశ్రమ ఎంతో ఉన్నత స్తాయిలో వుంది దూర దర్శన్ లో అరగంట చిత్రలహరి కార్యక్రమంతో మొదలైన ప్రస్థానం నేడు 148 శాటిలైట్ చానల్స్, 82 యు ట్యూబ్ చానల్స్, 9 ఓటిటి ప్లాట్ ఫాం తో ప్రతి రోజు 180 షూటింగ్ లతో షుమారు ప్రత్యక్షంగా 20 వేల మంది పరోక్షంగా ఒక లక్షా 26 వేల మందికి ఉపాది కల్పిస్తుంది. అంతే కాకుండా టెలివిజన్ పరిశ్రమ ప్రజలకు వినోదాన్నిఅందిస్తూ, వ్యాపార పరంగా వేల కోట్ల ఆదాయం పై వచ్చే టిడిఎస్, జిఎస్టీ, వంటి పన్నుల రూపంలో వందల కొట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చుతుంది. కాని నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి టెలివిజన్ పరిశ్రమ కు ఉపాధి కాని, ఆర్ధిక సహకారం వెసులుబాటు లేని పరిస్థితి వుంది. తెలుగు టెలివిజన్ పరిశ్రమ కార్మికులకు, సాంకేతిక నిపుణులకు టి వి నగర్ తో పాటు, ఇల్లు లేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, జీవిత భీమా, ప్రమాద భీమ కల్పించాలని, 60 ఏళ్ళు నిండిన కార్మికులకు, సాంకేతిక నిపుణులకు నెలకు పది వేల రూపాయల పెన్షన్ అందించాలని, టి ఎల్ కాంత రావు, పైడి జై రాజ్ గార్ల పేరిట ప్రతి ఏడాది అవార్డులు ఇవ్వాలని, నైపుణ్యం పెంచడానికి సెమినార్ లు వర్క్ షాప్ లు నిర్వహించాలని,సంస్థ మనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక గారికి తెలుగు టెలివిజన్ పరిశ్రమ ప్రముఖులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
సంస్థ మనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక మాట్లాడుతూ : భారత దేశం లోనే కాక, ప్రపంచ స్తాయిలోనే చలన చిత్ర, టి వి, ఓటిటి ల నిర్మాణం రికార్డు స్తాయిలో జరుగుతున్నాయని గుర్తు చేస్తూ… తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో అన్ని రంగాల మాదిరిగానే టి వి రంగాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తారని, త్వరలోనే ఈ విషయాన్నీ, ముఖ్య మంత్రి గారి దృష్టికి, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులకు, తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర టి వి నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు గారి దృష్టికి తీసుకు వెళతానని, టి వి నగర్, జీవిత భీమా, ప్రమాద భీమా, మరియు పెన్షన్ వంటి సదుపాయాలు అందించడానికి కృషి చేస్తానని, కొన్ని ఆర్ధిక సంబంధమైన విషయాలను ముఖ్య మంత్రి గారి దృష్టికి తీసుకు వెళతానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
ఈ సంధర్భంగా దర్శక నిర్మాత లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ రచించిన తెలివిజన్ చరిత్ర పుస్తక ఆవిష్కరణ, మరియు బుస్సా బాలరాజు నిర్వహణలో త్వరలో జరుగనున్న ఫిలిం టెలివిజన్ అవార్డుల బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది.







