DNA: డీఎన్‌ఏ పరీక్షలే కీలకం.. రెండు, మూడ్రోజులు పట్టే అవకాశం
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలు మాంసపు ముద్దలుగా, బూడిద కుప్పల్లా మారిపోవటంతో ఏ మృతదేహం ఎవరిదో నిర్ధారించేందుకు డీఎన్‌ఏ (DNA) పరీక్షలే కీలకం కానున్నాయి. ఇప్పటికే 16 మంది మృతుల బంధువుల నమూనాలు సేకరించారు. డీఎన్‌ఏ పరీక్షల నివేదికలు రావడానికి రెండు మూడ్రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. నివేదికలు వచ్చాక కుటుంబ సభ్యుల (Family members) కు మృతదేహాలు అప్పగించనున్నారు. పరీక్షలు త్వరితగతిన పూర్తి చేయటానికి ఏపీ ఫోరెన్సిక్ (AP Forensic) ప్రయోగశాల డైరెక్టర్ జి. పాలరాజు (G. Palaraju) నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.







