Niranjan Reddy:ఆయన్ను మానసికంగా వేధించడంతోనే రాజీనామా : నిరంజన్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) , మంత్రుల ఆధిపత్య ధోరణి భరించలేకే కొందరు ఐఏఎస్ (IAS) లు రాజీనామా చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజ్వీ (Rizvi) నిజాయతీ గల అధికారి అని ప్రజలందరికీ తెలుసన్నారు. ఆయన్ను మానసికంగా వేధించడంతోనే రాజీనామా (Resignation) చేశారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు ఐఏఎస్ రిజ్వీ రాజీనామా చెంపపెట్టు అన్నారు. సీఎం, మంత్రులు లూటీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎంపై మంత్రి కుమార్తే ఆరోపణలు చేశారని ఎద్దేవా చేశారు.






