వివేక్ హెచ్ మూర్తిని తొలగించిన ట్రంప్
డోనాల్డ్ ట్రంప్.. నేడు మరో భారతీయుడిని కీలక పదవి నుంచి తొలగించారు. అమెరికా సర్జన్ జనరల్‌గా అత్యున్నత పదవిలో ఉన్న వివేక్ హెచ్ మూర్తి అనే భారత సంతతి వ్యక్తిని శుక్రవారం పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో ఇప్పటి వరకూ డిప్యూటీ జనరల్‌గా ఉన్న రీయర్ అడ్మైరల్ సైల్వియా ట్రెంట్ ఆడమ్స్కు పదోన్నతి లభించింది. ఎటువంటి కారణం చెప్పకుండానే వివేక్‌ను ట్రంప్ ప్రభుత్వం రాజీనామా కోరడంతో అమెరికాలోని భారతీయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.






