వైభవంగా ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్ బతుకమ్మ వేడుకలు
                                    ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ వేడుకలను ఇల్లినాయి రాష్ట్రంలో కూడా ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించి సంస్కృతి గొప్పదనాన్ని తెలియజేశారు. అక్టోబర్ 5వ తేదీన షుంబర్గ్లోని నేషనల్ ఇండియా హబ్ లో ఈ వేడుకలు జరిగాయి. ప్రెసిడెంట్ హేమంత్ పప్పు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతోపాటు ఇతర ముఖ్యులు పాల్గొని వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలను అందంగా అలంకరించి తీసుకుని వచ్చారు. సంప్రదాయంగా గౌరీ దేవిని పూజించారు. బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ ఆడారు. ఈ వేడుకలకు వచ్చినవారందరికీ భోజనాలను వడ్డించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను విజయవంతం చేసినవారందరికీ సహకరించిన వలంటీర్లకు, స్పాన్సర్లకు ట్రై స్టేట్ తెలుగు సంఘం ధన్యవాదాలను తెలియజేసింది.







