మే 30న ‘టెన్నెసీ తెలుగు సమితి’ ఆధ్వర్యంలో మెన్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్!
TTS: క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం , కమ్యూనిటీని ఏకం చేసే లక్ష్యంతో టెన్నెసీ తెలుగు సమితి (TTS) ప్రతిష్టాత్మకమైన ‘మెన్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్ – స్ప్రింగ్ 2026’ను నిర్వహించనుంది. మే 30వ తేదీన బ్రెంట్వుడ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: మే 30, 2026.
- సమయం: ఉదయం 8:00 గంటల నుండి ప్రారంభం అవుతుంది.
- వేదిక: విలియమ్సన్ కౌంటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (920 Heritage Way, Brentwood, TN 37027).
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఒక్కో టీమ్‌కు $40 ప్రవేశ రుసుముగా నిర్ణయించారు. పరిమితంగా ఉన్న స్థానాల (Spots) దృష్ట్యా ఆసక్తి గల వారు వెంటనే ఈ క్రింది లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
https://tinyurl.com/TTSMPBS2026
మరిన్ని వివరాల కోసం విష్ణు (408-893-9751) ను సంప్రదించగలరు. క్రీడాభిమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టోర్నమెంట్‌ను జయప్రదం చేయాలని టెన్నెసీ తెలుగు సమితి ప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి






