బే ఏరియాలో తెలంగాణ అవతరణ వేడుకలు

బే ఏరియా లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకుని టిఆర్‌ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి, స్వరాష్ట్రాన్ని సాధించి..,బంగారు తెలంగాణ దిశగా ప్రజా పరిపాలన సాగిస్తున్నారని వక్తలు కొనియాడారు.
హరిశ్ రావు గారి జన్మదినోత్సవంను కూడా పురస్కరించుకుని వేడుకలను జరుపుకున్నారు. హరిశ్‌రావు మాట్లాడుతూ.. నాటి తెలంగాణ ఉద్యమంలో..నేటి రాష్ట్ర అభివద్ధి లో టి ఆర్ ఎస్ పార్టీలో ఎన్నారైలది కీలక పాత్ర అని.. అమెరికాలో కూడా వేడుకలు నిర్వహించి.మన ఖ్యాతిని చాటి చెపిన ఎన్నారై ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ బైరీ పూర్ణ, జొన్నలు ఉదయ్, శివ, రాము, జగన్, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.