Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Community » Usa Nri News » Tantex 165th literary conference

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 165వ సాహితీ సదస్సు

  • Published By: cvramsushanth
  • April 30, 2021 / 07:08 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Tantex 165th Literary Conference

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సాహిత్య సదస్సు నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 18న జరిగిన 165 వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. చిన్నారి మాడ సమన్విత పాడిన “హరి బోలా దేతా, హరి బోలా ఘేతా” అన్న సంత్ ఏకనాథ్ రాసిన భజన కీర్తనతో  సభ ప్రారంభమైంది.  

Telugu Times Custom Ads

శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ చిన్నారి సమన్విత “రామ జనార్థన రావణ  మధన” అన్న ముత్తుస్వామి దీక్షితర్ వారి శంకరాభరణ రాగ నోటుస్వర గేయాన్ని ఆలపించింది. తదుపరి గేయంగా చిన్నారులు సాహితి వేముల, సిందూర వేముల “ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో!” అన్న సుప్రసిద్ధ దాశరథి వారి గేయాన్ని ఆలపించారు. గొప్ప సామాజిక సందేశం కలిగిన దాశరథి వారి గేయం చిన్నారుల నోట పలకడం సభికులను ఆకట్టుకుంది. 

ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్య  అతిథిగా ఆచార్యులు శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి గారు విచ్చేశారు. ఉపద్రష్ట సత్యంగారు రాజేశ్వరిగారిని సభకు పరిచయం చేస్తూ వారి సాహిత్య జీవన ప్రస్థానాన్ని చక్కగా వివరించారు.బెంగళూరు విశ్వవిద్యాలయంలో “ప్రబంధ రూపాన్ని పొందిన సంస్కృత నాటకాలు” అన్న సిద్దాంత గ్రంథం రాసి పి హెచ్ డి పొందారు. నాలుగు దశాబ్దాలుగా కన్నడ, తెలుగు సాహిత్యాలకు తులనాత్మక వ్యాసాలు రాసి ఉభయ భాషా కవయిత్రిగా సృజనాత్మక పాత్ర పోషించారు. “భూమి తడిపిన ఆకాశం”, “నీరు స్థంభిచిన వేళ”, “నక్షత్ర దాహం” వంటి స్వీయ కవితా సంపుటులను, ఎన్ గోపి గారి “కాలాన్ని నిద్ర పోనివ్వను” అన్న తెలుగు కవితా సంపుటిని కన్నడ భాషాలోకి రాజేశ్వరి గారు అనువాదం చేశారు.  దివాకర్ల తిరుపతి శాస్త్రి, దివాకర్ల వేంకటావధాని వంటి గొప్ప పేరున్న అగ్రేసర సాహిత్యకారుల కుటుంబ నేపథ్యం ఒక వైపు, స్వీయ సాహిత్యజీవన సాఫల్యాలు మరో వైపు కలసి రాజేశ్వరి గారి సాహిత్య సేవను పరిపుష్టం చేశాయి. 

రాజేశ్వరి ముఖ్య అతిథి ప్రసంగం చేస్తూ “ప్రబంధ యుగంలో స్త్రీ” అన్న అంశం పై ఎన్నో చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య దృష్టి కోణాలన్నీ విస్తరిస్తూ సాధికారిక చర్చచేశారు. అధ్యాపకులుకుగా, కళాశాలలో తెలుగు శాఖాద్యక్షులుగా విస్తార అననభవం గల రాజేశ్వరి గారు, కృష్ణ దేవరాయలు కాలంనాటి సాహిత్యాన్ని పరిమిత సమయంలోనే సమగ్రంగా విశ్లేషించారు. ప్రబంధ యుగ కవులు సమాజాన్ని మార్చాలనే ఆశయాన్ని కలిగిన ఉద్యమకారులు కాకపోవచ్చునే కాని, ఉత్తమ కావ్య లక్షణాలు ఏవైతే ఉండాలో అన్నిటిని సమస్తమూ రంగరించి గొప్ప కళా ప్రయోజనాన్ని సాధించిన సాంస్కృతిక యోధులని మాత్రం మనం గుర్తించి గర్వించాలని రాజేశ్వరి గారు ప్రతిపాదించి తమ ప్రసంగం ద్వారా నిరూపించారు. ప్రబంధాలు తెలుగు భాషకు, తెలుగు వాడి సాంస్కృతిక చారిత్రక జీవన పథానికి చెందిన అమూల్య సంపదగా పరిగణించి విద్యార్థులకు బోధ చేయాలని పిలుపునిచ్చారు. రాజేశ్వరి గారు ప్రసంగాన్ని విస్తరిస్తూ వరూధిని, గోదాదేవి నుండి మొదలుకొని సోమిదమ్మ వరకూ సాగిన వివిథ ప్రబంధ యుగ స్త్రీ పాత్రలకు కావ్యకర్తలు ఆపాదించిన వ్యక్తిత్వాలను చారిత్రక, సామాజిక విలువల దృష్టి కోణం నుండి చూపించారు. రాజేశ్వరి అద్భుత ప్రసంగానికి సభికులు సహృదయంతో స్పందించి ధన్యావాదాలు తెలిపారు. 

ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న “మన తెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి గారు  కొన్ని పొడుపుకథలు, జాతీయాలు, ప్రహేళకలు ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సదస్యులను చర్చలో భాగస్వాములును చేశారు. తరువాత లెనిన్ వేముల మాట్లాడుతూ డాక్టర్ దివాకర్ల వేంకటావధానిగారు సిద్దాంత గ్రంథంగా రాసిన “ఆంధ్ర వాఙ్మయారంభ దశ” అనే పరిశోథనను గూర్చి వివరించారు. ఆది కవి నన్నయ్యకు పూర్వం వేయబడిన వందల సంఖ్యలో ఉన్న శాసనాలను పరిశీలించి, వాటి లో ప్రయోగించబడిన భాషాపదాలకు ఛందస్సుకూ నన్నయ్యగారి మహాభారత కావ్యంలో వాడబడిన పదాలకు, ఛందస్సుకు ఉన్న తోడాలను, పోలికలను శాస్త్రీయ దృష్టి తో దివాకర్ల గారు చేసిన పరిశోధనను లెనిన్ వేముల శ్లాఘించారు. 

తరువాతి అంశంగా మాడ దయాకర్ గారు పుస్తక పరిచయం చేస్తూ సుప్రసిద్ద పరిశోకులు, గేయ రచయిత ఆరుద్రగారు రచించిన “రాముడికి సీత ఏమైతుంది”అన్న నవల ఎందుకు విశిష్ఠమైనదో  వివరించారు. రామాయణ కథలలోని పాత్రలు, వాటి మధ్య సంబంధాలు కేవలం భారత సమాజంలో మనముందు చూపి చెప్పబడేవే కాక ఇతర మతాలైన జైన బౌద్ద విశ్వాసాలపై అవి చూపిన ప్రభావం, పాత్రల సంబంధా లలోని  భినత్వం ఏ విధంగా ఉన్నాయో వివరించేది ఆరుద్రగారి నవల అని చెప్పారు. ఉదాహరణకు పలు మతాల, సంస్కృతుల, దేశాల వారు రాముడి సీతకు మధ్య బంధాన్ని కొందరు  భార్యా భర్తలుగా మరి కొందరు సోదర సంబంధంగా చెప్పారు. ఇన్ని మత సంస్కృతులలో ఎవరు ఏది చెప్పారో అన్న పరిశీలన చేసిన నవలగా ఆరుద్ర గారు రచన మిగులుతుందని దయాకర్ గారు వివరించారు. తరువాతి అంశంగా మద్దుకూరి చంద్రహాస్ “కలలో ఇలలో కరోనా” అన్న స్వీయ కవితను వినిపించారు. చైత్రలక్ష్మి ప్రత్యక్షమై త్వరలో కరోనా విముక్తి జరుగునన్న ఆమె సందేశం వినిపించగా, కలలో ఆమెతో జరిపిన ఆశావహ సంభాషణను సాంప్రదాయ ఛందస్సునూ, వచన, గేయ రీతులను సమపాళ్ళలో  ప్రయోగించి శ్రోతలను చంద్రహాస్ తన కవిత ద్వారా మెప్పించారు. 

చివరి అంశంగా శ్రీ ఉపద్రష్ట సత్యం గారు “పద్య సౌగంధం” శీర్షికన రాయల వారి అష్టదిగ్గజ కవులలో ఒకరైన పింగళి సూరన రచించిన “కళా పూర్ణోదయం” కావ్యంలోని “ఆ కొమరున్ ప్రాయపు గబ్బి గుబ్బెతలు”, “భళిరా సత్కవివౌదు నిక్కమ తగన్ భావించ” అన్న రెండు పద్యాలను తాత్పర్య సహిత విశేషాలతో వివరించారు. నారద మునీంద్రల వారు, మణికంధరుడు ఆకశయానం చేసి భూలోకంపై వాలుతున్నపుడు ఊయలలూగుతూ పాదాలు ఆకాశానికెత్తిన యువతులను చూసి కవితావేశాన్ని పొంది చేసిన చక్కటి రసభావగుంభిత సంభాషణయే ఈ రెండు పద్యాలు. ఆ ఆకాశంలోకి రువ్విన పాదాలు దేవతా స్త్రీలతో సౌంధర్య విషయంలో కయ్యానికి కాలు దువ్వతున్నాయా అన్నట్లున్నాయని మణికంధరుడంటే, కయ్యమేమిటి అసలు ఆ దేవతా స్త్రీల అందాన్ని తలదన్నే విధందా ఉన్నాయని నారదుల వారి చేత పలికించిన కవీంద్రులు పింగళి సూరన గొప్ప ప్రావీణ్యం గల కవిగా ఉపద్రష్ట వారు ఎత్తిచూపి చెప్పారు

ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త శ్రీమతి నీరజా కుప్పాచి  తదితర కార్వవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులు, స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. వారు ముఖ్య అతిథి ఘంటశాల నిర్మల గారికి, ప్రార్థనా గీతం పాడిన  సమన్విత తోపాటు ముఖ్య అతిథి దివాకర్ల రాజేశ్వరిగారికి, కార్యక్రమంలో  పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

Tags
  • 165th Literary Conference
  • TANTEX
  • us

Related News

  • Us Republican Alexander Duncan Calls Hanuman Statue False God Draws Outrage

    Alexander Duncan: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ సన్నిహితుడి వివాదాస్పద వ్యాఖ్యలు

  • Tta Indiana Chapter Bathukamma Celebrations

    TTA: టీటీఏ ఇండియానా చాప్టర్‌ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

  • Arya University School Of Medicine Building Groundbreaking Ceremony

    Arya University: ఆర్య యూనివర్సిటీ మెడిసిన్‌ భవన నిర్మాణం ప్రారంభం

  • Ata Ex President Parmesh Bheemreddy About H 1b Visa

    H-1B Visa: హెచ్1బి వీసాపై ఆందోళనలు వద్దు.. ఇప్పటికీ అమెరికాలో స్థిరపడే అవకాశాలున్నాయి..

  • Dasharathi Centenary Celebrations By Ata In New Jersey

    ATA: ఘనంగా ఆటా దాశరథి శత జయంతి సాహిత్య సభ

  • Tana 5k Run In Charlotte 2

    TANA: ఛార్లెట్‌లో ఘనంగా తానా 5కె రన్‌…

Latest News
  • Group 1: గ్రూప్ 1కు లైన్ క్లియర్..! నేడో రేపో ఫైనల్ రిజల్ట్స్..!!
  • Digital Book: రెడ్‌బుక్‌కు పోటీగా వైసీపీ డిజిటల్ బుక్..!
  • Nara Lokesh: మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన నారా లోకేష్
  • YS Jagan: ప్రతిపక్ష హోదా కోసం మళ్లీ హైకోర్టుకు జగన్..! కీలక ఆదేశాలు..!!
  • Alexander Duncan: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ సన్నిహితుడి వివాదాస్పద వ్యాఖ్యలు
  • Priyanka Arul Mohan: ప్రియాంక ద‌శ మారిన‌ట్టేనా?
  • Raasi: నెట్టింట వైర‌ల్ అవుతున్న సీనియ‌ర్ హీరోయిన్ ల‌వ్ స్టోరీ
  • BJP: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆవేదన.. అసెంబ్లీ లో కూటమి విభేదాలు హైలెట్..
  • B.Tech Ravi: వైఎస్సార్ కంచుకోటలో టీడీపీ వ్యూహం ..జగన్‌కు పెరుగుతున్న ప్రెషర్..
  • Satya Kumar Yadav: సత్యకుమార్ పై బాబు ప్రశంసల జల్లు..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer