తానా స్వర్ణోత్సవాలు… రోడ్ల పరిశుభ్రత కార్యక్రమాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని మహత్తరమైన సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అమెరికాలోని 50నగరాల్లో 50 రోడ్లను దత్తత తీసుకుని పరిశుభ్రత చర్యలను చేపట్టనున్నారు. అమెరికా వ్యాప్తంగా తానా చేపట్టనున్న ఈ పరిశుభ్రత కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుతున్నారు.
సమాజ సేవే మన సంస్కృతి.. పరిశుభ్రమైన పరిసరాలే మన బాధ్యత అనే సంకల్పంతో తానా అడాప్ట్ ఎ స్ట్రీట్ TANA Adopt A Street కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభిస్తోంది.
ఈ కార్యక్రమం ద్వారా North America వ్యాప్తంగా 50 నగరాల్లో 50 రహదారులను దత్తత తీసుకుని, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక చైతన్యానికి కొత్త దిశను చూపించబోతున్నారు. మే 16న ఛార్లెట్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన వీధి… మన బాధ్యత. మన సేవ… మన సమాజానికి స్ఫూర్తి అన్న నినాదంతో తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.






