మే 9న జాక్సన్విల్లేలో ‘టాజా’ ఉగాది సంబరాలు!
TAJA: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్లే ఏరియా (TAJA) ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ప్రధాన ఆకర్షణలు..
టాజా అధ్యక్షుడు సాయిశంకర విశ్వనాధ, కార్యదర్శి అనిల్ యాద నేతృత్వంలో ఈ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు ఈవెంట్ డైరెక్టర్లు రాజ్యలక్ష్మి పాలడుగు, శ్రావణి బడ్డం, విష్ణుసుధ సజ్జన, స్నేహ దుర్గ, శిరీష పోకల, జయలక్ష్మి లంకడ, సునీత ముంద్రాతి, విజయశ్రీ బాబు, రాధిక గజుల, వినీల ఐత నిరంతరం శ్రమిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
విందు, వినోద కార్యక్రమాల..
కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం సాంప్రదాయ ఉగాది విందు భోజనం, స్నాక్స్, రాత్రి భోజన ఏర్పాట్లు చేసినట్లు టాజా కార్యవర్గం తెలిపింది. పిల్లల కోసం బౌన్సీ హౌస్, ఇతర వినోద కార్యక్రమాలను కూడా సిద్ధం చేశారు.
వివరాలు..
- తేదీ: మే 9, 2026, శనివారం.
- వేదిక: Ponte Vedra High School, 460 Davis Park Rd, Ponte Vedra Beach, FL 32081.
- సమయం: ఉదయం 11:00 నుండి రాత్రి 9:00 వరకు.
నిర్వాహకులు: ప్రెసిడెంట్ సాయిశంకర విశ్వనాధ, సెక్రటరీ అనిల్ యాద, ట్రెజరర్ చంద్ర చలపాటి, పిఆర్ సెక్రటరీ హరి గుంటూరు , ఇతర కార్యవర్గ సభ్యులు.
ఈ కార్యక్రమంలో వివిధ వ్యాపార స్టాళ్లు, విక్రేతల ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. తెలుగువారందరూ సాంప్రదాయ దుస్తులలో విచ్చేసి ఈ ఉగాది వేడుకలను జయప్రదం చేయాలని సాయిశంకర విశ్వనాధ , అనిల్ యాద కోరారు.






