డల్లాస్ లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టాటా) సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకల్లో భాగంగా చివరిరోజున శ్రీనివాస స్వామి కళ్యాణంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్) సహాయంతో ఈ శ్రీనివాస కళ్యాణం ఘనంగా జరిగింది. ఇరు సంఘాల నాయకులతోపాటు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






