ఎస్పిబికి ప్రశంసాపత్రం
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సాంస్కృతిక కార్యదర్శి పేరి జానకి ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల బృందం హ్యూస్టన్ వచ్చిన సందర్భంగా బాలూ గారికి బహూకరించడానికి ఒక అభినందన పత్రం తయారు చేసి అందజేసింది. హ్యూస్టన్ తెలుగు ప్రముఖుడు, వంగూరి ఫౌండేషన్ నిర్వాహకుడు వంగూరి చిట్టెన్రాజు ఈ ప్రశంసాపత్రాన్ని బాలుకు అందజేశారు.






