జూలై 17-19న TTA మెగా కన్వెన్షన్.. సాంస్కృతిక ప్రదర్శనలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న “TTA మెగా కన్వెన్షన్ 2026” వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించేందుకు కళాకారులకు అద్భుతమైన అవకాశం లభించింది. 2026, జూలై 17 నుండి 19 వరకు నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది.
ఆహ్వానం..
ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ప్రతిభావంతులైన వ్యక్తులను , బృందాలను TTA సాంస్కృతిక కమిటీ ఆహ్వానిస్తోంది. సుమారు 10,000 మందికి పైగా ప్రేక్షకుల సమక్షంలో తమ నృత్య, సంగీత, నాటక ప్రదర్శనలతో అలరించాలనుకునే వారు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
వివరాలు..
- వేదిక: షార్లెట్ కన్వెన్షన్ సెంటర్, నార్త్ కరోలినా.
- తేదీలు: జూలై 17–19, 2026.
- రిజిస్ట్రేషన్ లింక్: https://tinyurl.com/TTAConvention-Cultural
మరిన్ని వివరాలకు విజయ్ పిల్లి (714-200-4925) లేదా కళ్యాణి చలసాని (704-671-8044)లను సంప్రదించవచ్చు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై చాటిచెప్పే ఈ మహాత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని TTA ప్రతినిధులు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి






