Ravi Mandalapu: ఎపి సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా రవి మందలపు

కృష్ణా జిల్లా పసుమర్రుకు చెందిన ఎన్నారై రవి మందలపు (Ravi Mandalapu) చేసిన సేవలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆయనను ఎపి సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఫిలడెల్ఫియా లో ఉంటూ ఐటీ రంగంలోనే కాక ఇతర రంగాలలో కూడా విజయవంతంగా బిజినెస్ చేస్తూ, సక్సెస్ ఫుల్ ఎంట్రప్రెన్యూర్ గా పేరు తెచ్చుకున్న రవిమందలపు ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా)లో అనేక పదవులు నిర్వహించారు. తానా ఫౌండేషన్ ద్వారా అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలకు సహాయం అందించారు. అందరికీ సహాయం అందించడంలో ముందుండే రవి మందలపు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటూ అనేక కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. 2023లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల (జోన్-2) తెదేపా ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాజమహేంద్రవరం గ్రామీణంలోని తొర్రేడులో ఓటరుగా నమోదు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశారు. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జరిగిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
యూఎస్ఏలో ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన రవి టీడిపి విజయానికి చేసిన కృషిని గుర్తించిన చంద్రబాబు నాయుడు ఆయనను సైన్స్ అండ్ టెక్నాలజీకి చైర్మన్ గా నియమించారు. ఆయన నియామకం పట్ల పలువురు ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుటైమ్స్ కూడా ఆయనకు అభినందనలను తెలియజేస్తోంది.