AB Venkateswara Rao:ఆయన హయాం లో రూ.40 వేల కోట్ల అవినీతి : ఏబీ వెంకటేశ్వరరావు

ఏపీ ఎస్పీడీసీఎల్ మాజీ చైర్మన్ సంతోష్‌రావు హయాంలో భారీగా అవినీతి జరిగిందని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు (AB Venkateswara Rao) ఆరోపించారు. తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ శివశంకర్ (CMD Shivshankar) ను ఆయన కలిశారు. డిస్కంలో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని, విచారణ జరిపించాలని కోరారు. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సంతోష్‌రావు (Santosh Rao) ఇష్టానుసారంగా ప్రవర్తించారు. 2023లో రూ.కోట్లలో అవినీతి బయటపడిరది. సామాన్య ప్రజల నుంచి డబ్బు వసూలు చేయడం సరికాదు. విద్యుత్ రంగంలో గతంలో ఎప్పడూ ఇలా జరగలేదు. ప్రభుత్వం మారినా సంతోష్‌రావు కొనసాగారు. 12 సార్లు ఆర్టీఐ (RTI) కింద సమాచారం అడిగినా ఇవ్వలేదు. ఆయన అవినీతిపై సంపూర్ణ ఆధారాలు సేకరించాం అని అన్నారు.