Chandrababu:అధికారులు అప్రమత్తం గా ఉండాలి : చంద్రబాబు ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సమీక్షించారు. అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత (Home Minister Anita)ను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు (Police) , మున్సిపల్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ (Rayalaseema) లో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. కాల్వలు, చెరువు గట్లను పటిష్టపరచాలని అధికారులకు సీఎం సూచించారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.