TTA: టీటీఏ మెగా కన్వెన్షన్‌కు రాజపుష్ప ప్రాపర్టీస్ మద్దతు
టీటీఏ మెగా కన్వెన్షన్ ఈ ఏడాది జులై 17 నుండి 19 వరకు షార్లెట్ లో జరగనున్న విషయం విదితమే. అయితే మెగా కన్వెన్షన్ కు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ తమ విలువైన మద్దతును విరాళాన్ని అందజేసింది. 2006లో పరుపాటి సోదరులు స్థాపించిన రాజపుష్ప ప్రాపర్టీస్ నేడు హైదరాబాద్ లోని అగ్రగామి రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటిగా ఎదిగింది.
వినూత్నమైన ఆలోచనలు నాణ్యమైన నిర్మాణాలతో విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు విల్లాలను నిర్మించడంలో ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మన తెలుగు సమాజం గర్వపడేలా నిర్వహించే ఈ భారీ సమ్మేళనంలో రాజపుష్ప ప్రాపర్టీస్ భాగస్వామ్యం కావడం పట్ల టీటీఏ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివాకర్ జంద్యం ఇతర సభ్యుల సమక్షంలో ఈ మెగా కన్వెన్షన్ ను గ్రాండ్ గా చిరస్మరణీయంగా నిర్వహించడానికి రాజపుష్ప అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయం.






