పాఠశాల 2019-20 తరగతులు ప్రారంభం

అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న పాఠశాల 2019-20 సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్త విద్యాసంవత్సరం తరగతులను కూడా ప్రారంభించింది. కొత్తగా చేరిన విద్యార్థులతో, తల్లితండ్రులతో పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు, బే ఏరియా పాఠశాల డైరెక్టర్ ప్రసాద్ మంగిన, అకడమిక్ డైరెక్టర్ రమేష్ కొండతోపాటు టీచర్లు శ్రీదేవి పసుపులేటి, పద్మ (ఫ్రీమాంట్), రజిత (డబ్లిన్), శరత్ పోలవరపు (డబ్లిన్), సత్య బుర్ర, శ్రీదేవి ఎర్నేని, కళ్యాణ్ చికోటి (శాన్‌రామన్) సమావేశమై పాఠశాల బోధన పద్ధతులను వివరించారు.