మెట్టుదిగిన అమెరికా… చర్చలకు రావాలని ఉత్తరకొరియాకు ఆహ్వానం
దక్షిణ కొరియాకు సమీపంలో యుద్ధ నౌకలను మోహరించి, పరిస్థితిని ఉద్రిక్తం చేసిన అమెరికా ఓ మెట్టు దిగింది. చర్చలకు రావాలని ఉత్తర కొరియాను కోరింది. రెచ్చగోట్టే వ్యాఖ్యలు మానుకుని, ఉద్రిక్త పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించాలని, ఇందు కోసం చర్చిద్దామని కోరుతూ పెంటగాన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ ఒప్పందాలను దృష్టిలో ఉంచుకుని, చర్చల ద్వారా సానుకూలత సాధించేందుకు ఉత్తర కొరియా ముందుకు రావాలని, అస్థిరతను పెంచే యత్నాలు కూడదని హితవు పలికింది. చట్టవిరుద్ధంగా క్షిపణులను పరీక్షించడం తమ దేశ భద్రతకు బెదరింపుగా భావిస్తున్నామని, ఈ విషయంలో మరిన్ని అడుగులు ముందుకు వేయవద్దని సూచించింది. కాగా తమ తీరానికి సమీపంలో ఉన్న అమెరికా యుద్ధ నౌను ఒక్క బాంబుతో ముంచేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించిన మరునాడే అమెరికా ఇలా స్పందించడం గమనార్హం.













