NATS: జన్మభూమిలో నాట్స్ సేవలను విస్తరిస్తాం…

తెలుగు టైమ్స్ ఇంటర్వ్యూలో అధ్యక్షుడు శ్రీహరి మందాడి
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీహరి మందాడి (Sri Hari Mandadi) అధ్యక్షునిగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటింటి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను తెలుగు టైమ్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు పలు విషయాలను ఆయన వెల్లడించారు.
నాట్స్‌లో మీ ప్రవేశం, ఇతర విషయాలను చెప్పండి?
అమెరికాలో తెలుగువాళ్ళకు ఎంతో సేవలందిస్తున్న నాట్స్‌కు అధ్యక్షుడిగా ఎన్నికకావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాట్స్‌తో నా అనుబంధం 2010 నుంచి సాగుతోంది. 2011లో సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎంతోమందికి ఏర్పడిన పరిచయం తరువాత నాట్స్‌లో పలు బాధ్యతలను చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. 2013లో నార్త్ ఈస్ట్ జోనల్ వైస్-ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు బోస్టన్, హారిస్బర్గ్, కనెక్టికట్ వంటి విభాగాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 2017 నుండి నాలుగు సార్లు నాట్స్ బోర్డులో డైరక్టరుగా సేవలందించారు. ఇవిపిగా కూడా పనిచేశాను. సంస్థలో ఆయన సేవలను గమనించిన ఉన్నత నాయకత్వం ఆయనను అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. తాను నాట్స్ అధ్యక్షుడిగా ఎంపిక వెనుక తన మిత్రుడు మోహనకృష్ణ మన్నవ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని ఈ సందర్భంగా శ్రీహరి మందాడి చెప్పారు. నాట్స్‌లోని ఇతర నాయకుల మద్దతు తనకు ఉన్నందున ఈ పదవి ద్వారా కమ్యూనిటీకి ఎంతో సేవలందించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
తన స్వగ్రామం ఇతర వివరాల గురించి చెబుతూ, తాను గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరుకు చెందినవాడినని, విద్యాభ్యాసం తరువాత చెన్నైలో ఎంసిఎ చదివిన తరువాత అమెరికా వెళ్ళాను. అక్కడ ఉద్యోగాలు చేస్తూనే, వ్యాపారరంగంలో కూడా అడుగుపెట్టాను. అంచెలంచెలుగా ఎదుగుతూ, మరోవైపు తెలుగు కమ్యూనిటీకి సేవ చేయాలన్న తలంపుతో నాట్స్‌లో చేరి అధ్యక్షుడిగా మరింతగాసేవలందించే అవకాశం నాకు కలిగింది.
అధ్యక్షుడిగా ఏమేమి చేయాలనుకుంటున్నారు?
నాట్స్ సేవలను మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాను. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా నాట్స్ సేవలను మరింతగా అందించాలని అనుకుంటున్నాను. అమెరికాకు వచ్చే విద్యార్థులకోసం ఓ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నాను. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వాళ్ళు నాట్స్ మెంబర్ షిప్ తీసుకుంటే చాలు. వారికి లైఫ్ ఇన్స్యూరెన్స్ వస్తుంది. పిల్లలు, తల్లితండ్రులు అందరూ నాట్స్ కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా దేశం మొత్తం మీద నాట్స్ కార్యక్రమాలను మరింతగా చేయనున్నాను. స్టూడెంట్స్ వలంటరీ అవర్స్ పేరుతో కార్యక్రమాన్ని రూపొందించి అందులో స్టూడెంట్లను ఇన్వాల్వ్ చేయనున్నాను. నాట్స్ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం పెంచడంతోపాటు వారికి ప్రెసిడెన్షియల్ వలంటీర్ సర్వీస్ అవార్డ్ అందజేస్తాము. దీనివల్ల వారు ఉన్నత చదువులకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ పురస్కారం వారికి మరింతగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము.
నాట్స్ ట్యాగ్ లైన్ భాషే రమ్యం…సేవే గమ్యం అన్నది. అందుకు తగ్గట్టుగా తెలుగు భాషను మన చిన్నారులు మరింత సులభంగా చదువుకునేలా సోషల్ మీడియా ప్లాట్ పారమ్ మీద రాసేలా చర్యలు చేపట్టనున్నాను. ఎక్కడెక్కడ నాట్స్ ఛాప్టర్‌లు లేదో అక్కడ అంతా నాట్స్ విభాగాలను ఏర్పాటు చేయనున్నాను.
అలాగే నాట్స్ నిర్వహిస్తున్న ఉచిత వైద్యసలహా కార్యక్రమాలను, రోడ్ల పరిశుభ్రత, తెలుగు భాష, కళల వికాసానికి లలిత కళల వేదిక వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ కళాకారులను ఆదుకునేలా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
జన్మభూమి సేవా కార్యక్రమాలు గురించి చెప్పండి?
అమెరికాలో మనకు ముఖ్యమైనా, తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు కమ్యూనిటీకి కూడా నాట్స్ తరపున సేవలను అందించాలని భావిస్తున్నాను. మరింత విస్తృతంగా అవసరమైనవారికి నాట్స్ చేయూతనందించేలా కార్యక్రమాలను రూపొందించుకుని చేయడం జరుగుతుంది. ఇటీవల నాట్స్ ద్వారా అటు హైదరాబాద్‌లో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో సేవలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలను నా పదవీకాలంలో అన్నీ చోట్ల జరిగేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది. డిసెంబర్ లో నెలరోజులపాటు సేవా కార్యక్రమాలను చేయనున్నాము. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఇతరులకు సేవలందించనున్నాము. సహాయం చేయనున్నాము. చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని సహాయంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి.
ఇమ్మిగ్రేషన్ విధానంలో వచ్చిన మార్పుల వల్ల చాలామంది కష్టపడుతున్నారు? నాట్స్ వారికి ఏ విధంగా సహాయపడనున్నది?
ట్రంప్ వచ్చిన తరువాత ఇమ్మిగ్రేషన్ విధానంలో తీసుకువచ్చిన మార్పుల వల్ల అటు విద్యార్థులు, ఉద్యోగులు ఇతరులు అందరూ కష్టపడుతున్నారు. వారిని ఆదుకునేందుకు నాట్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కష్టాల్లో ఉన్నవారికోసం నాట్స్ హెల్ఫ్ లైన్ ను ప్రారంభించింది. ఈ హెల్ఫ్ లైన్ ప్రవేశపెట్టిన మొదటి జాతీయ తెలుగు సంఘం నాట్స్ అన్నవిషయం మీకు తెలిసిందే. ఇప్పుడు నాట్స్ మార్గంలేనే అన్నీ సంఘాలు హెల్ఫ్ లైన్ ను ప్రారంభించాయి. ఎకానమి సమస్య వల్ల విద్యార్థుళు, ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తగిన ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో నాట్స్ తనవంతుగా వారికి అవసరమైన శిక్షణను, ఇతర సూచనలను అందించేందుకు చర్యలు చేపడుతుంది. అలాగే ఇమ్మిగ్రేషన్ విధానంలో తీసుకువచ్చిన మార్పుల వల్ల ఇబ్బందులను పడుతున్నవారికోసం మా ఇమ్మిగ్రేషన్ విభాగం సహాయాన్ని అందిస్తోంది. మా అటార్నీలు ఈ విషయంలో ఎప్పటికప్పుడు మార్గదర్శకత్వాలను అందిస్తూ అందుకోసం సెమినార్‌లను ఏర్పాటు చేసి వివరించడం జరుగుతోంది. నాట్స్ మెంబర్ షిప్ కార్యక్రమం కూడా ముమ్మరంగా జరుగుతోంది. మా ఇ-మెయిల్ డేటా నే లక్షదాకా ఉంటుందని అంటున్నారు. డోనర్లు, లైఫ్ మెంబర్లు మాకు ఎక్కువగానే ఉన్నారు. ఇంకా ఈ మెంబర్ షిప్ డ్రైవ్ చేయాలని అనుకుంటున్నాము.
తెలుగుటైమ్స్ ద్వారా మీరిచ్చే సందేశమేమిటి?
అటు సేవా-ఇటు భవిత రెండిరటికి నాట్స్‌ను ఒక బలమైన వారధిగా ఉంది. నాట్స్ కార్యక్రమాల్లో కమ్యూనిటీ ఎక్కువగా పాల్గొనాలని, దాతలు మరింతగా ముందుకు వస్తే కార్యక్రమాలను మరింతగా విస్తరించేందుకు ముందుకు రావాలని కోరారు.