సీఎం చంద్రబాబుతో నాట్స్ అధ్యక్షుడి భేటీ
రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. మన ఊరు, జన్మభూమి, స్మార్ట్ విలేజ్, డిజిటల్ తరగతి గదులు తదితర కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ సంస్థలను ఏర్పాటు చేయాలని నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణకు సూచించారు. మోహనకృష్ణ సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. జూన్ 30, జూలై 1,2 తేదీల్లో చికాగోలో నిర్వహిస్తున్న నాట్స్ సంబరాలకు ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం తదితర గ్రామాల్లో కిడ్నీ వ్యాధుల నివారణకు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. అనంతపురం ప్రకాశం, గుంటూరు మరికొన్ని జిల్లాల్లో పాఠశాలలను దత్తత తీసుకున్నాం అని తెలిపారు.













