అశోక్ గజపతిరాజుకు నాట్స్ ఆహ్వానం
జున్ 30 నుంచి జూలై 2 వరకు చికాగోలో జరిగే నాట్స్ 2017 ఉత్సవాల్లో పాల్గొనాలని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆహ్వానించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో నాట్స్ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ భేటీ అయ్యారు. అనంతరం మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి ఎన్నారైల మృతదేహాలను భారత్కు తరలించే సందర్భంలో విమానాల్లో రాయితీలు ఇవ్వాలని అశోక్ గజపతిరాజును కోరారు. ఇతర దేశాల్లో భారతీయులు మృతి చెందినప్పుడు, వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎయిర్ ఇండియా విమానాల్లో మృతదేహాల తరలింపు చార్జీలు తక్కువగా ఉంటాయని, మిగత విమాన సంస్థలు కూడా అదే మాదిరి చార్జీలు తగ్గించేలా చూడాలని విన్నవించారు. అశోక్ గజపతిరాజు స్పందిస్తూ క్యాబినెట్లో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.













