నాట్స్ కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది: పురంధేశ్వరి
సంబరాలకు రావాలని దగ్గుబాటి కుటుంబానికి నాట్స్ ఆహ్వానం
అమెరికా తెలుగు సంబరాలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. (జూన్ 29 నుండి జులై 2 వరకు) ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగురాష్ట్రాల్లో ఆహ్వానాల ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని కలిసిన నాట్స్ బృందం సంబరాలకు రావాలంటూ ఆహ్వానాన్ని అందించింది. పురంధేశ్వరి తో పాటు ఆమె భర్త.. సీనియర్ రాజకీయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా సంబరాలకు ఆహ్వానించింది. నాట్స్ తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి గుర్తు చేసుకున్నారు. నాట్స్ చేసే సేవా కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఆ తర్వాత టీవీ5 ఛైర్మన్ బీఆర్. నాయుడుతో పాటు, టీవీ5 సీఈఓ కృష్ణారెడ్డిని సంబరాలకు రావాలంటూ ఆహ్వానం అందించింది. నాట్స్ ఆహ్వానాలను అందించిన వారిలో నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ రవి అచంట తదితరులు ఉన్నారు.






