నాట్స్ సంబరాలకు న్యూజెర్సీ తెలుగు ప్రముఖుల బాసట
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ద్వైవార్షిక అమెరికా తెలుగు సంబరాలు ఈ ఏడాది చికాగో వేదికగా జూన్30, జులై1-2 తేదీల్లో నిర్వహిస్తోంది. సంబరాలకు సన్నాహకంగా న్యూజెర్సీలోని రాయల్ అల్బెర్ట్స్ కన్వెన్షన్ హాల్ లో అమెరికా తెలుగు సంబరాలు చికాగో కన్వెన్షన్ 2017- కర్టన్ రైజర్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ మద్దాళి శ్యాం, అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ, కార్యదర్శి అప్పసాని శ్రీధర్, డైరక్టర్ల బోర్డు సభ్యులు దేసు గంగాధర్, అప్పలనేని రాజేంద్ర, గంటి అరుణ తదితరులు ప్రసంగిస్తూ నాట్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను విశదీకరించారు. బోన్‌మారో డ్రైవ్‌పై డా.మధు కొర్రపాటి, సంబరాల ఏర్పాట్లపై సమన్వయకర్త ఆచంట రవిలు ప్రసంగించారు. న్యూజెర్సీ ప్రజావసరాల శాఖ సంచాలకులు చివుకుల ఉపేంద్ర నాట్స్ కార్యక్రమాలను అభినందించారు. న్యూజెర్సి, న్యూయార్క్, పెన్సిల్వేనియా రాష్ట్రాల ప్రతినిధులతో పాటు నాట్స్ సెక్రటరీ నూతలపాటి రమేష్, ఉపాధ్యక్షుడు మందాడి శ్రీహరి, న్యూజెర్సి విభాగ సమన్వయకర్త వెనిగళ్ల వంశీకృష్ణ, నాట్స్ ప్రచార విభాగ అధ్యక్షుడు మేడిచెర్ల మురళీకృష్ణ, ఏ.ఆర్.చౌదరి తదితరులు పాల్గొన్న ఈ కార్యర్కమంలో 5లక్షల డాలర్లను అందించేందుకు ప్రవాసులు హామీలు ఇచ్చారు.






