భారతీయ విద్యార్థులకు మిస్సోరి వర్సిటీ ప్రత్యేక స్కాలర్షిప్లు
భారతీయ విద్యార్థుల కోసం మిస్సోరి యూనివర్శిటీ ప్రత్యేక స్కాలర్‌షిప్పులను ప్రకటించింది. యూఎస్‌లోని ఎంఎస్‌యు ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ కలోనెల్ స్టెఫీస్ రాబిన్టే భారత్ పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఎంఎస్‌యు భారతీయ విద్యార్థులకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వివరించారు. భారతీయ విద్యార్థులకు ప్రతీయేటా 5వేల డాలర్ల ఇంటర్నేషనల్ ఎక్స్‌లెన్స్ స్కాలర్‌షిప్పు అందిస్తున్నట్లు తెలియజేశారు. ఇటువంటి అవకాశం అందుకున్న విద్యార్థులు చదువు విషయంలో తమకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించగలరని పేర్కొన్నారు. 25 సంవత్సరాలుగా విద్యార్థులకు సేవలు అందిస్తున్న ఎంఎస్‌యు భారతీయ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమైన కోర్సులను అందిస్తున్నదని తెలిపారు.






