జూన్ 6న సాన్ ఆంటోనియోలో భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణం
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో జూన్ 6, 2026న టెక్సాస్లోని సాన్ ఆంటోనియోలో భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ‘మాటా’ రెండో మహాసభల సన్నాహకాల్లో భాగంగా ఈ ఆధ్యాత్మిక వేడుకను ఏర్పాటు చేశారు.
నిర్వహకులు..
ఈ కార్యక్రమ విజయవంతం కోసం ఈ క్రింది ముఖ్య నేతలు పర్యవేక్షిస్తున్నారు..
- మహేందర్ నరాల, జగదీష్ గుర్రాల, రామ్ జోలుకుంట్ల
- రమణ కిరణ్ దుద్దాగి
- శ్రీధర్ గూడాల
- టోనీ జన్ను, దాము గేదల
- ప్రవీణ్ గుడూరు
- విజయ్ భాస్కర్ కలాల్
- శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, జితేందర్ రెడ్డి
కార్యక్రమ వివరాలు..
తేదీ: జూన్ 6, 2026 (శనివారం), ఉదయం 9 గంటలకు.
వేదిక: మహాలక్ష్మి హాల్, హిందూ టెంపుల్ ఆఫ్ సాన్ ఆంటోనియో.
రిజిస్ట్రేషన్ ఫీజు: ప్రతి జంటకు $116.
భక్తులు అధికారిక వెబ్సైట్ లేదా పోస్టర్లోని క్యూఆర్ (QR) కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాల కోసం www.mata-us.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.






