శాంతిదూత పురస్కారం అందుకున్న మలాలా
నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్జాయ్కు ఐక్యరాజ్యసమితి శాంతిదూత పురస్కారం ప్రకటించింది. మలాలా ఈ అవార్డును ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మాలాలా మాట్లాడుతూ మహిళల రెక్కలను పురుషులు కట్టిపడేయొద్దు. వారిని స్వేచ్ఛగా ఎగరనివ్వాలి అని పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌కు చెందినన 19 ఏళ్ల మలాలా బాలికల విద్య కోసం విశేష కృషి చేస్తోంది. మహిళల జీవితంతో పురుషులు, తండ్రులు, సోదరుల పాత్రలు చాలా కీలకం అన్నారు. పాక్‌లోని స్వాత్ లోయ ప్రాంతంలో నాలాంటి అమ్మాయిలు ఎందరో ఉన్నారు. తమ భావాలు వెల్లడించగలరు. కానీ అందరు వారి తండ్రులు, సోదరులు అంగీకరించడం లేదని తెలిపారు. కానీ నా విషయంలో అలా జరగలేదు. నా తండ్రి నన్ను ఎప్పుడూ ఆపలేదు. నా తండ్రి, కుటుంబం నాకు స్వేచ్చ ఇచ్చారు. కుటుంబంలోని పురుషులందరూ మహిళలను ప్రోత్సహించాలి. వారు అనుకున్నది సాధించనివ్వాలి అని అన్నారు.






