డొనాల్డ్ ట్రంప్ అల్లుడు ఇరాక్ పర్యటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేరెడ్ కుష్నర్(36) తమ దేశ సైనిక అత్యున్నతాధికారితో కలిసి ఇరాక్‌లో పర్యటిస్తున్నారు. కుష్నర్ను, అంతర్గత భద్రతపై అధ్యక్షుడిగా సలహాదారు టామ్ బోసర్ట్లను అమెరికా త్రివిధ దళాధిపతుల కమిటీ చైర్మన్ జనరల్ జో డన్ఫర్డ్ తనతోపాటు ఇరాక్‌కు తీసుకొచ్చారు. ఇరాక్ నాయకులతో సమావేశం, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను తుదముట్టించే పోరాటంపై సమీక్ష నిమిత్తం ఈ పర్యటన చేపట్టారు. ఇస్లామిక్ స్టేట్‌పై పోరులో ఇరాక్ ప్రభుత్వానికి, అమెరికా సైనిక బలగాలకు మద్దతు తెలిపేందుకు అధ్యక్షుడి తరపున కుష్నర్ పర్యటిస్తున్నారు.






