ఇండియా డే పెరేడ్లో పాల్గొన్న జే తాళ్ళూరి, రవి పొట్లూరి
భారత జాతీయ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్ నగర వీధుల్లో ఎఫ్ఐఎ ఆధ్వర్యంలో జరిగిన పెరెడ్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు కూడా పాల్గొన్నారు. తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ జే తాళ్ళూరి, తానా కోశాధికారి రవి పొట్లూరి, న్యూజెర్సి ప్రాంతీయ తానా నాయకుడు విద్యాగారపాటి, నాగరాజు నలజుల, శిరీష తూనుగుంట్ల తదితరులు పాల్గొన్నారు.






