వీసా మార్పులతో భారత్‌కే ప్రయోజనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా నిబంధనల్లో మార్పుల ప్రతిపాదన భారతీయ ఐటిని నిపుణులకు ప్రయోజనకరమేనని, ఎక్కువ మొత్తంలో వేతనాలు లభిస్తాయని యుఎస్ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే టెక్నాలజీ కంపెనీలతో పాటు బిజినెస్ ఔట్సోర్సింగ్ కంపెనీలకు వేతనాల బిల్లు పెరిగిపోతుందని బనియాన్ ట్రీ క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్టనర్ ఇగ్నాటియెస్ చిటెలేం అన్నట్లు వార్టాన్ వెబ్సైట్ పేర్కొంది. ఈ అదనపు వ్యయం ఏడాదికి 120 కోట్ల డాలర్లు ఉంటుందని, హెచ్1బీ వీసా కలిగిన వ్యక్తికి వార్షిక వేతనం 100,000 డాలర్లు ఉంటుందని భావించవచ్చునని, ప్రస్తుతం జారీ చేస్తున్న వీసాలు అదే స్థాయిలో కొనసాగుతాయని ఆయన అన్నారు. అయితే కొత్త వీసా విధానం ఈ ఏడాది నవంబర్ నాటికి ప్రకటించవచ్చునన్నారు.













