మే 9న వర్జీనియాలో జిడబ్ల్యూటిసిఎస్ ‘MLC’ మ్యూజికల్ అండ్ కామెడీ షో
GWTCS: బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను పురస్కరించుకుని ఉత్తర వర్జీనియాలో ఒక వినూత్నమైన కార్యక్రమం జరగనుంది. అమెరికాలోనే మొట్టమొదటిసారిగా “టీమ్ అనంతం – USA టూర్” పేరుతో సంగీతం, సాహిత్యం , హాస్యం (MLC – Music, Literature, Comedy) కలబోసిన త్రివేణి సంగమం లాంటి వేడుకను నిర్వహిస్తున్నారు.
ఆకర్షణలు..
ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ నేతృత్వంలో జరిగే ఈ ‘MLC’ షోలో సాయి-పవన్ బ్యాండ్ తమ ప్రదర్శనతో అలరించనుంది. ఈ వేడుకలో భాగంగా వయోలిన్ విద్వాంసురాలు కామాక్షి, డ్రమ్మర్ పవన్ బృందం సంగీత విభాగాన్ని.. అనంత శ్రీరామ్ తన సాహిత్య మాయాజాలాన్ని.. , అభి అండ్ టీమ్ తమ కామెడీ షోతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తనున్నారు.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: మే 9, శనివారం
- సమయం: సాయంత్రం 4:00 గంటలకు
- వేదిక: Droumavalla Farm, 14980 Limestone School Rd, Leesburg, VA.
జిడబ్ల్యూటిసిఎస్ ప్రెసిడెంట్ రవి సి. అడుసుమిల్లి , కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది పండుగ వాతావరణం ఉట్టిపడేలా సాగే ఈ సాంస్కృతిక వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. టిక్కెట్లు , ఇతర వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీలను సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి






