న్యూజెర్సిలో టిటిఎ ప్రచార కార్యక్రమం విజయవంతం… 3.45 లక్షల డాలర్ల విరాళాల సేకరణ
జూలై 17 నుంచి 19వ తేదీ వరకు ఛార్లెట్ లో నిర్వహించనున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మహాసభలను పురస్కరించుకుని వివిధ నగరాల్లో టిటిఎ నాయకులు ప్రచార కార్యక్రమాలను, మీట్ అండ్ గ్రీట్ పేరుతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా న్యూజెర్సిలో ఏప్రిల్ 11వ తేదీన అక్బర్ రెస్టారెంట్ లో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వచ్చింది. మహాసభల నిర్వహణకోసం పలువురు తమవంతుగా విరాళాలను కూడా అందించారు.
ఈ సందర్భంగా టిటిఎ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది మాట్లాడుతూ, టిటిఎ వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆదరణ చూపించడంతోపాటు, విరాళాలను అందించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. న్యూజెర్సికి చెందిన అడ్వయిజరీ కో చైర్ డా. మోహన్ రెడ్డి పాటలోళ్ళ ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా టిటిఎ మహాసభలకోసం 345,000 డాలర్లు అంటే 3.45 లక్షల డాలర్ల విరాళాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డితోపాటు అడ్వైజరీ చైర్ విజయ్ పాల్ రెడ్డి, కో-చైర్ మోహన్ రెడ్డి పాటలోళ్ళ , ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది, మరియు కన్వీనర్ ప్రవీణ్ చింత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు టిటిఎ మహాసభల గురించి వివరించి అందరూ ఈ మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాయనీ గాయకులు చైతు మద్దూరి, అద్వైత్ పాటలు పాడి అందరినీ అలరించారు. న్యూజెర్సి టీటిఎ నాయకులు శివారెడ్డి కొల్ల, నరసింహ పెరుక, సుధాకర్ ఉప్పల, అరుణ్ అర్కల తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.
ఇవి కూడా చదవండి






