మే 30న నార్త్ కరోలినాలో ‘పల్లె వంట’.. తెలంగాణ రుచుల పండుగ!
GTA: ప్రవాస భారతీయులకు తెలంగాణ గ్రామీణ రుచులను, వారసత్వాన్ని పరిచయం చేసే లక్ష్యంతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) రాలి చాప్టర్ ఆధ్వర్యంలో ‘పల్లె వంట’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మే 30, శనివారం రోజు నార్త్ కరోలినాలోని అపెక్స్ నగరంలో ఈ వేడుక జరగనుంది.
ఇవి కూడా చదవండి
కార్యక్రమ వివరాలు..
- తేదీ: మే 30, శనివారం
- సమయం: ఉదయం 11:30 గంటల నుండి ప్రారంభం అవుతుంది.
- వేదిక: వైట్ ఓక్ రిక్రియేషన్ ఏరియా, వైట్ ఓక్ బీచ్ రోడ్, అపెక్స్, NC 27523
ముఖ్య విశేషాలు..
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించే ఈ కార్యక్రమంలో కుకింగ్ కాంపిటీషన్ (వంటల పోటీలు) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీటితో పాటు వివిధ రకాల స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ వేడుకలో పాల్గొనాలనుకునే వారు , పోటీల్లో భాగస్వామ్యం పొందాలనుకునే వారు ఈ క్రింది లింకుల ద్వారా నమోదు చేసుకోవచ్చు.
- సాధారణ రిజిస్ట్రేషన్: https://forms.gle/cVawTHY77Wrcv7Ut8
- వంటల పోటీలు: https://forms.gle/GVCDoZwf2xYMUAKw5
- వ్యాపార స్టాల్స్: https://forms.gle/LNATzHMWdsGm7DJW9
- సాంస్కృతిక ప్రదర్శనలు: https://forms.gle/qjoxFhANvyzayp3r5
తెలంగాణ రుచులను ఆస్వాదిస్తూ, మన సంప్రదాయాలను గుర్తుచేసుకునే ఈ పల్లె వంట కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాలకు www.gtaraleigh.org వెబ్సైట్ను సందర్శించగలరు.






