నాటా అందాల పోటీల్లో విజేత నేహ గద్దె
నాటా 2023 మహాసభల కార్యక్రమాల్లో భాగంగా 8రాష్ట్రాల్లో నిర్వహించిన టీన్ నాటా పోటీల్లో గెలుపొందిన ఆయా రాష్ట్రాలకు చెందిన యువతులు డల్లాస్లో ఆదివారం నాడు మహాసభల వేదికపై జరిగిన ఫైనల్ పోటీల్లో పాల్గొని తమ బాణీని వినిపించారు. ఫైనల్ పోటీల్లో విజేతగా గద్దె నేహా నిలిచింది. ఆమెను సినీనటి తమన్నా సత్కరించారు.






