ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ యువకులు
తెలుగు యువకుల సత్తా అంతర్జాతీయంగా మరో సారి వెలుగు చూసింది. ఆసియాకు చెందిన అత్యంత ప్రభావశీలురైన 30 మందితో ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన 30 ఏళ్ల లోపు యువకుల జాబితాలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు చోటు దక్కించుకున్నారు. వీరిలో హైదరాబాద్కు చెందిన రోహిత్ పోతుకూరి ఒకరు కాగా, మరొకరు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన చిలప్పగారి సుధీంద్ర. ప్రపంచాన్ని ప్రభావితం చేసే యువ పారిశ్రామికవేత్తలు, సృజనశీలురు, నాయకులను ఈ ఫోర్బ్స్ ఈ జాబితాలో ఎంపిక చేస్తుంది.






