AAA: ఎఎఎ మహాసభలకు అంతా సిద్ధం
ఫిలడెల్ఫియాలో మరో తెలుగు పండుగ ఘనంగా జరగనున్నది. ఆంధ్రులకోసం, ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాల అభివృద్ధికోసం అమెరికాలోని ఎన్నారై ఆంధ్రులు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటిసారిగా భారీ ఎత్తున మహాసభలకు సిద్ధమైంది. మార్చి 28,29 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్లో జరిగే ఈ మహాసభలకోసం ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీరంగానికి సంబంధించిన హీరోహీరోయిన్ లు, దర్శకులు, నేపథ్య సినీ గాయనీ గాయకులు, ఇతరులు తరలివచ్చారు.
ఈ మహాసభలకోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పలు రాజకీయ పార్టీల నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతరరంగాల ప్రముఖులు కూడా వచ్చారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరి ఈ మహాసభల్లో హైలైట్ గా నిలవనున్నది. టీటీడి పండితులు, బోర్డ్ సభ్యులు కూడా ఈ మహాసభలకు వచ్చారు. బిజినెస్ సెమినార్లో పాల్గొనేందుకు ఆయా రంగాలకు చెందినవారు కూడా వచ్చారు. ఇప్పటికే మహాసభలకు వచ్చినవారితో ఈ ప్రాంతమంతా సందడిగా కనిపిస్తోంది.
మహాసభలకు సంబంధించిన కార్యక్రమాల కోసం ఈ క్రింద AAA Brochure ను చూడండి.







